ఆర్థిక నిపుణులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిలో పెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఐటీ రంగం అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. రైతుబంధు కచ్చితంగా ఉండటమే కాదు.. రూ. 16 వేలు పెరుగుతుందని తెలిపారు.
ధరణి తీసి బంగాళకాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. మరి ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా ఇస్తారని కేసీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మోసపోతే.. ఐదేంళ్లు గోసపడతామని కేసీఆర్ అన్నారు.
రైతులకు రైతుబంధు, 24 గంటల కరెంట్ వద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వేస్ట్ అంటున్నాడు.. మరి 3గంటల కరెంట్ తో ఎన్ని పంటలు పండుతాయని ప్రశ్నించారు. రైతులకు 10HP మోటారు ఎవరు కొనిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ మళ్లీ పాత విధానమే తెస్తుందని చెప్పారు. తెలంగాణ బాగుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలని కేసీఆర్ కోరారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.