దళితబంధు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను కరీంనగర్ గడ్డపైనే ప్రకటించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్పారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదం కరీంనగర్ నుంచే మొదలైందని తెలిపారు. కరీంనగర్ ఏ అభ్యర్థి గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు.
విద్యుత్ వినయోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ధరణితో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఓటు వేసేటప్పుడు ఓటర్లు విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు.
కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను 58 ఏళ్లు కష్టాల పాలుజేసిందని విమర్శించారు.