కాంగ్రెస్ ఎక్కడైనా రూ. 2వేల పెన్షన్ ఇస్తే.. ముక్కు నేలకు రాస్తా: కేసీఆర్

కాంగ్రెస్ ఎక్కడైనా రూ. 2వేల పెన్షన్ ఇస్తే.. ముక్కు నేలకు రాస్తా: కేసీఆర్

కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చీల్చే కుట్రలు చేసిందని.. పిచ్చి కుక్కలు మస్తుగా మొరుగుతాయని.. మేం తిట్టుడు మొదలు పెడితే రోజంతా సరిపోదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి బంద్ చేస్తామంటున్నారు.. మరీ ధరణి బంద్ చేస్తే.. రైతు బంధు ఎలా వస్తదని నిలదీశారు. ధరణి తీసేస్తే మళ్లీ పాతకథ మొదలు పెడతారని చెప్పారు. 

తెలంగాణ రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేసిందని.. ఆ కుట్రలకు తిక్కరేగి అమరణ దీక్ష చేపట్టానని సీఎం కేసీఆర్ అన్నారు. దిక్కులేక అప్పుడు కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిందని తెలిపారు. కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వట్లేదు.. మరి తెలంగాణలో రూ. 4వేల పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎక్కడైనా రూ. 2వేల పెన్షన్ ఇస్తోందా? ఇస్తున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్ అన్నారు.  

పదేళ్లకు ముందు పదేళ్ల తర్వాత అన్నట్లుగా తెలంగాణ మారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా, గోవావరి నదుల మధ్య ఉండి అప్పట్లో తాగునీరు లేదన్నారు. ధాన్యం పంటలో తెలంగాణ, పంజాబ్ ని దాటేసిందని చెప్పారు. తెలంగాణలో ఎక్కడా చూసినా పొలాలే.. హెలికాప్టర్ లో నుంచి చూశాను.. అన్నీ వడ్లకుప్పలే కనిపిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. 

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని కేసీఆర్ అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ మాయ మాటలు ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ ఉన్నది తెలంగాణను మోసం చెయ్యడానికేనని విమర్శించారు. కరువు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఏమైపోమయారని నిలదీశారు.  జనగామ జిల్లా చేర్యాల ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.