పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (సెప్టెంబర్ 17న) జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు పబ్లిక్‌ గార్డెన్స్‌ వచ్చిన ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు.

ALSO READ: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్ 

అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.