పగబట్టిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయద్దని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల మోటార్లకు మీటార్లు పెట్టాలని మోదీ అన్నారని తెలిపారు. రాష్ట్రం నాశనం అవుతుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. గతంలో కేంద్రానికి 100 ఉత్తరాలు రాసినా.. ఒక నవోదయ స్కూల్ ని తెలంగాణకు ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.
ధరణి బంద్ అయితే రైతుబంధు నగదు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు బంధు దుబారా అంటోందని విమర్శించారు. రైతులంతా కాలు బయట పెట్టకుండానే రైతుబంధు డబ్బులు వారి ఖాతాలో పడుతున్నాయి.. రైతు బంధు తీసేస్తే.. రైతులు మళ్లీ ఇబ్బందుల్లో పడుతారని కేసీఆర్ అన్నారు. కాబట్టి ఎన్నికల ముందు మోసపోకుండా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ ఓటర్లకు సూచించారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని కేసీఆర్ అన్నారు. ప్రజలు గుడ్డిగా ఓటు వేయొద్దు.. అన్ని పార్టీలను గమనించే ఓటు వేయాలని చెప్పారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు.