ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుంది: కేసీఆర్

ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతులకు భూములపై హక్కులున్నాయని చెప్పారు. ధరణితో 15 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్ అవుతుందని.. ధరణి తిసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతుబంధు దుబారా అంటోందని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ 3 గంటల కరెంట్ చాలంటున్నారని.. 30 లక్షల మోటార్లు ఎవరు మార్చాలని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతుబంధు రూ. 10 వేల నుంచి రూ. 16 వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. పరకాలకు కోర్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని చెప్పారు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు.