బహుజన చైతన్యానికి ఐలమ్మ ప్రతీక: సీఎం కేసీఆర్

బహుజన చైతన్యానికి ఐలమ్మ ప్రతీక: సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆదివారం ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించు కొని సీఎంవో నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సాయుధ తెలంగాణ పోరాటంలో ఆమె కనబరిచిన ధైర్యసాహసాలను సీఎం స్మరించుకు న్నారు. వివక్షను ఎదిరిస్తూ ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధన ఉద్యమంలోనూ ఇమిడి ఉందన్నారు. 

ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకుంటున్నదని తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.