- ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
- పలు సమస్యలు పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే రెడ్యానాయక్
- సానుకూలంగా స్పందించిన కేసీఆర్
మరిపెడ,వెలుగు: ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచాక.. డోర్నకల్‌కు నిధులు ఇచ్చి, సమస్యలు పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్ అధ్యక్షత మంగళవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తానే దగ్గరుండి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు రెడ్యానాయక్ ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. మరిపెడను రెవెన్యూ డివిజన్ చేయాలని, డీబీఎం 60 కెనాల్ సిమెంట్ లైనింగ్ కు నిధులు మంజూరు చేయాలని కేసీఆర్‌ను కోరారు. మరిపెడలో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు ఐదు కోట్ల నిధులు మంజూరు చేయాలని అడిగారు. డోర్నకల్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ ,100 బెడ్ల ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నారు.
ALSO READ : వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు నిరసిస్తూ కాంగ్రెస్ లీడర్ల ఆందోళన
వీటిపై స్పందించిన కేసీఆర్.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ పనులకు నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, స్టేట్ లీడర్ రంగారెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు నూకల నరేశ్ రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బండి వెంకటరెడ్డి పాల్గొన్నారు.