
ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 అక్టోబర్ 27వ తేదీన సీఎం కేసీఆర్ మూడు సభల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్, వర్దన్నపేట, పాలేరులో జరిగే బహిరంగ సభలకు సీఎం హాజరవనున్నారు. ముందుగా సీఎం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని జీళ్లచెరువులో జగిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వర్ధన్న పేటలో జరగనున్న బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ క్రమంలో వరంగల్ నుంచి బట్టుపల్లి మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం12.30 నుంచి సాయంత్రం 6 గంటల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు నాయుడు పంపు నుంచి పోర్టురోడ్డు, తెలంగాణ జంక్షన్, ఎనుమాముల మార్కెట్ నుంచి ఓరర్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వచ్చే భారీ వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఓఆర్ఆర్ మీదుగా, ఎనుమాముల మార్కెట్, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు మీదుగా ఖమ్మం వైపు చేరుకోవాలని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.