తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి  చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో స్వామి వారి కోసం తయారు చేసిన 2 కేజీల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు.