యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకోనున్నారు. సతీమణి శోభతో కలిసి ఆయన రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకున్నారు. బస్సులోనే కొండ చుట్టూ గిరి ప్రదిక్షణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కేసీఆర్ దంపతులు స్వామివారి దర్శనానికి వెళ్లనున్నారు. నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

సీఎం కేసీఆర్‌ కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. బాలాలయం ఆవరణలో  కళావేదికకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.