కులం, మతం పేరుతో ఇంకా గొడవలు జరుగుతున్నాయి.. ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాల్సి ఉందని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ఇక్కడి పథకాలు మహారాష్ట్ర ప్రజలకు కూడా కావాలని అడగుతున్నారని అన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం.. ధరణి, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నాం.. సాగునీటికి లోటు లేదన్నారు. నిజాంసాగర్ లో 365 రోజులు నీళ్లతో నిండి ఉంటుందని హామి ఇస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు.. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమాకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది.. టైం కు డబ్బులు ఇస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్రోకర్ల రాజ్యం వస్తుందన్నారు. పైరవీ కారుల దందాలే మిగులుతాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.