అడ్డగోలుగా ఓటేస్తే ఐదేళ్లు బాధపడాలి : సీఎం కేసీఆర్

అడ్డగోలుగా ఓటేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తదని.. పోటీ చేస్తున్న వారి గుణగణాలు, వారి వెనక ఉన్న పార్టీ, వారి సమర్థత చూసి ఓటేయాలని కోరారు సీఎం కేసీఆర్. కామారెడ్డి ఎన్నికల  ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ఉన్న తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ.. 50యేళ్లు మనల్ని గోస పెట్టింది.. మళ్లా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వస్తున్నారు. అలాంటి పార్టీకి ఓటేస్తే మళ్లీ మొదటికే వస్తదన్నారు కేసీఆర్. నెహ్రు ప్రధాని అయిన నాడే దళిత బంధు లాంటి పథకం తెస్తే దళితుల పరిస్థితి ఇవాళ ఇలా ఉండేది కాదన్నారు సీఎం కేసీఆర్.

ఎన్నికల్లో ప్రజలు గెలిచే రోజులు రావాలన్నారు సీఎం కేసీఆర్.కొందరు అడ్డగోలుగా హామీలు ఇస్తరు.. వారిని నమ్మి మోస పోవద్దు..నేను కామారెడ్డికి వస్తే చాలా అభివృద్ది జరుగుతది.. కామారెడ్డి రూపు రేఖలు మారిపోతాయి.. ఎల్లారెడ్డికి మంచినీళ్లు ఇతర వసతులు తీసుకొస్తాం.. గం పగోవర్థన్ రెడ్డి ఒత్తిడి మేరకే నేను కామారెడ్డినుంచి పోటీ చేస్తున్నా.. అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు  సీఎం కేసీఆర్.