- లంచ్ పెట్టి మరీ కొత్తగూడెంపై మాట ఇచ్చిండు
- నెలన్నరలో ఎలక్షన్ నోటిఫికేషన్
- జల్ది పనులు కంప్లీట్చేయండి..లేదంటే మర్యాద దక్కదు
- ఆఫీసర్లకు వనమా హెచ్చరిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘ఇటీవల సీఎం కేసీఆర్నన్ను లంచ్‌కు ప్రగతిభవన్పిలిచిండు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్తరుపున నువ్వే పోటీ చేయాలని చెప్పిండు. నేను అడిగిన అన్ని పనులకు సాంక్షన్ఇచ్చిండు.. నెల, నెలన్నరలోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తది.. నియోజకవర్గంలో డెవలప్ మెంట్పనులు స్పీడ్‌గా చేయాలె..లేదంటే మర్యాద దక్కదు’ అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆఫీసర్లను హెచ్చరించారు.
కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో పలు శాఖల జిల్లా, మండల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తాను సీఎంను ప్రగతిభవన్‌లో కలిసినప్పుడు పాల్వంచ గవర్నమెంట్హాస్పిటల్ను 100 బెడ్స్‌గా మార్చాలని అడగ్గానే హరీశ్‌రావుకు ఫోన్ చేసి చెప్పారని, హెలీ కాప్టర్లో వెళ్లి శంకుస్థాపన చేసి రావాలని సూచించారని అన్నారు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో అభివృద్ధి పనులకు రూ. 96కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులకు శంకుస్థాపన చేసి రావాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసి ఆదేశించారన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీకి రూ.115 కోట్లు, పాల్వంచకు రూ.100కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ పనులకు దశలవారీగా శుక్రవారం నుంచి శంకుస్థాపనలు చేయనున్నట్టు ఎమ్మెల్యే వనమా తెలిపారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. టైం తక్కువగా ఉందని, నియోజకవర్గంలోని పనులన్నీ 25రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో వేగం పెంచకపోతే మర్యాద దక్కదని హెచ్చరించారు.
కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తాగునీరివ్వాలని మిషన్ భగీరథ ఆఫీసర్లను ఆదేశించారు. నియోజకవర్గంలో మన ఊరు, మన బడి పనులు స్లోగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో 76జీవో ప్రకారం పెండింగ్‌లో ఉన్న పట్టాల పంపిణీకి ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. నేషనల్ హైవే పనుల్లో జాప్యంపై ఆర్అండ్బీ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు.
కాగా, అధికారిక రివ్యూ మీటింగ్‌లో బీఆర్ఎస్నేతలు పాల్గొని అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పనులు చేయట్లేదని, లేట్చేస్తున్నారనడంతో ఎమ్మెల్యే ఆఫీసర్లపై ఫైర్అయారు. ఎమ్మెల్యే కొడుకు రాఘవ ఎప్పటికప్పుడు వనమాకు స్లిప్పులు పంపించడం కనిపించింది. జడ్పీ వైస్ చైర్మన్కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్కె. సీతాలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్రవిబాబు, విద్యుత్‌శాఖ ఎస్ఈ రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్సుకృత, జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్డాక్టర్ కుమారస్వామి, పాల్వంచ హాస్పిటల్ సూపరింటెండెంట్డాక్టర్ ముక్కంటేశ్వరరావు పాల్గొన్నారు.