నాగార్జున సాగర్ ఇప్పుడున్న ప్రాంతంలో కట్టాల్సింది కాదు..కుట్ర చేసిన్రు : సీఎం కేసీఆర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పుడున్న చోట కట్టా్ల్సింది కాదు.. అక్కడినుంచి 20 కిలోమీటర్ల పైన ఏళేశ్వరం వద్ద కట్టాల్సింది.. కానీ ఆనాడు అప్పుడున్న నేతలు గోల్ మాల్ చేసిన్రు.. ఫలితంగా తెలంగాణ ప్రాంతానికి నీరు తక్కువగా వచ్చేలా కుట్ర జరిగిందన్నారు సీఎం కేసీఆర్. ఆనాడు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని కూర్చున్నరు కాబట్టే ఇయ్యాళ తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని అని కేసీఆర్ అన్నారు. సభకు వచ్చిన ఊరికే వినిపోకుండా గ్రామాల్లోకి వెళ్లిన తర్వాత దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కోదాడ సభలో మాట్లాడుతూ..బీసీ చైతన్యం ఏంటో కోదాడ నుంచే చూపించాలని కోరారు. 60 శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడి పోకూడదని అన్నారు కేసీఆర్. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ ను గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. గెలిస్తే 10 కోట్లతో కోదాడలో బీసీ భవన్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు విజ్ఒతతో ఆలోచించాలి..మంచేదో.. చెడేదో తెలుసుకోవాలి.. అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్దతో పనిచేస్తున్న వారిని గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. కాళేశ్వరం నీళ్లతో పెద్ద దేవులపల్లి చెరువును నింపితే కరువుండదు.. ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. 

గత పదేళ్లుగా తెలంగాణ కరువు కాటకాలు లేకుండా.. శాంతియుత వాతావరణంలో బ్రహ్మాండమైన అభివృద్దితో ముందుకు సాగుతోందన్నారు సీఎం కేసీఆర్. కరెంట్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు 24 గంటల కరంట్ ఇస్తున్నాం.. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటే చాలు.. కేసీఆర్ వేస్ట్ గా 24 గంటలు ఇస్తున్నాడు.. అని విమర్శిస్తున్నారు.. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ ఎస్ ప్రభుత్వం కావాల్నా.. 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలన్నారు సీఎం కేసీఆర్. 

రైతు బంధు వేస్ట్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాల్నా.. వద్దా.. రైతుబంధు ఇస్తున్నా బీఆర్ ఎస్ ప్రభుత్వం కావాల్నా.. వద్దంటున్న కాంగ్రస్ కావాల్నా  ప్రజలే ఆలోచించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధును మేం గెలిచిన తెల్లారినుంచే 12 వేలు ఇస్తాం..విడతలుగా 16వేలకు పెంచుతామన్నారు కేసీఆర్.