హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు బహిరంగ లేఖ రాశారు.
ALSOREAD:ప్రపంచ బిర్యానీ దినోత్సవం ఎలా మొదలైంది.. ఎప్పుడు జరుపుకుంటారు
2014 ఎన్నికల సభలో వరంగల్‌ను డల్లాస్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పాడని గుర్తుచేశారు. తొమ్మిదేండ్లు దాటినా ఇంత వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని విమర్శించారు. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.