
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంట్ కావాలో.. 3గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ కు 20 సీట్లకు మించి రావన్నారు. ఆ పార్టీలో 20 మంది సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలన్నారు.
పొరపాటున కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కర్నాటక గతే..!
కర్నాటకలో ప్రజల గతి ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ? ఐదుగంటల కరెంటు ఇస్తున్నరు. అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. కేసీఆర్ నీకు తెలుసా? కావాలంటే వచ్చి చూడు రోజుకు ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అని ఓపెన్‌గా చెప్పిండు. జాగ్రత్తగా ఆలోలించి ఓటు వేయాలి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఎన్నికలకు ఐదారు రోజులు టైమ్ ఉంది. ప్రతి గ్రామాల్లో ఈ విషయాలపై చర్చ జరిగితే.. క్యూ కట్టి మనకు ఓట్లు గుద్దుతరు. కాబట్టి ఆ పని చేయాలని కోరుతున్నా.
మాణిక్‌రావు సౌమ్యుడు. చాలా పద్ధతి మనిషి. ఎవరినీ నష్టపెట్టేవాడు కాదు. అందరితో కలిసి ఉండేవాడు. ఎమ్మెల్యేగా గెలువంగనే హైదరాబాద్‌లోపోయి పడేటోడు కాదు. ప్రజల మధ్యనే ఉంటడు. మంచి వ్యక్తి అయిన మణిక్‌రావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలనుద్దేశించి బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ ప్రసంగించారు.