మూడోసారి అధికారంలోకి రాగానే  హామీలన్నీ నెరువేరుస్తాం .. ప్రజా ఆశ్వీరాధ సభల్లో సీఎం విజ్ఞప్తి

  • ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలి 

కోదాడ/తుంగతుర్తి/రాజాపేట/యాదగిరిగుట్ట : వెలుగు : బీఆర్​ఎస్​ మూడోసారి అధికారంలోకి రాగానే హామీలతోపాటు, పెండింగ్​ పనులన్నింటినీ పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్​ అన్నారు. ఆదివారం కోదాడ, తిరుమలగిరి, ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద స భల్లో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థులు బొల్లం మల్లయ్య యాదవ్​, గాదరి కిశోర్​ కుమార్, గొంగడి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కిశోర్​ను లక్ష మెజార్టీ గెలిపిస్తే నియోజకవర్గం మొత్తానికి దళితబంధు శాంక్షన్​ చేస్తామని, బునాది గానీ కాల్వల పనులు, దేవాదుల నీళ్లను తుంగతుర్తికి తీసుకొస్తామని, బస్వాపురం రిజర్వాయర్​తో బునాది గానీ కాల్వలను అనుసంధానం చేస్తామని చెప్పారు. మోత్కూరు, అడ్డగూడూరు గ్రామాల్లోని కాల్వలను వెడెల్పు చేస్తామని అన్నారు. 

సీఎం హామీలివే.. 

  • కోదాడలో మల్లయ్య యాదవ్​ను గెలిపిస్తే రూ. 10 కోట్లతో బీసీ భవన్​ నిర్మిస్తాం
  • నాగార్జున సాగర్​లో గోదావరి జలాల ను నింపేందుకు కృషి. రెండో పంటకూ గోదావరి జలాలు. కాళేశ్వరం జలాలను పెద్దదేవులపల్లి రిజర్వాయర్​కు తీసుకొచ్చి శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు కృష్ణాజలాలను అను సంధానం చేసే ప్రక్రియ వేగంవంతం చేస్తాం. 
  • కోదాడ పట్టణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి.
  •  సూర్యాపేట -– కోదాడ మధ్యలో డ్రై పోర్టు నిర్మాణం. దాని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం 
  •     మల్లన్నసాగర్​జలాలతో వచ్చే నాలుగైదు మాసాల్లో బస్వాపురం నింపుతాం.
  •     యాదగిరిగుట్టలోని గండి చెరువును ఇప్పటికే మల్లన్నసాగర్ జలాలతో నింపుకున్నాం. ఆలేరు నియో జకవర్గానికి నీరందించే పనులన్నీ త్వరలో పూర్తి చేస్తాం. 
  •     యాదగిరిగుట్టను తాము వచ్చాక అభి వృద్ధి చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రాజకీ య భవిష్యత్త్​కు తాను హామీ ఇస్తున్నట్టు సీఎం తెలిపారు

ముందస్తు అరెస్టులు

ఆలేరులో   బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా.. ఆదివారం‌పోలీసులు పలువురిని మందస్తు అరెస్టు  చేశారు. సీఎం కేసీఆర్ ను అడ్డుకుంటారనే   సమాచారం నేపథ్యంలో.. ఆటోలను కొండపైకి అనుమతించాలని ఏడాదిన్నరగా రిలే దీక్షలు చేస్తున్న యాదగిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్లు, రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయాలంటూ దీక్షలు చేపట్టిన మండల సాధన సమితి నాయకులతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి చిరిగె శ్రీనివాస్ ను ఆదివారం ఉదయమే అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కేసీఆర్ సభకు హాజరై తిరిగి వెళ్లిపోయిన తర్వాత వారిని వదిలిపెట్టారు. కాగా అరెస్ట్ ను ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఖండించారు. సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. అలాగే ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కల్లూరి రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. సీఎం స్వయంగా కల్లూరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అపర భగీరథుడు కేసీఆర్‌

 2014కు ముందు తుంగతుర్తి నియోజకవర్గం అల్లకల్లోలంగా ఉండేది. తెలంగాణ వచ్చాకే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1.50లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయ్​. 30, 40 ఏళ్లుగా నిండని చెరువులు కూడా నీటితో కళ కళలాడుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రి 93వేల మందికి రైతుబంధు, 49వేల మందికి ఆసరా, 11వేల మందికి కల్యాణలక్ష్మి, 8వేల మందికి కేసీఆర్‌ కిట్లు వచ్చినయ్​. 

ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

నా చర్మం వలిచి, చెప్పులు కుట్టించినా సీఎం రుణం తీర్చుకోలేను 

నా చర్మం వలిచి, చెప్పులు కుట్టించినా.. సీఎం  రుణం తీర్చుకోలేను. సొంత బిడ్డగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన నాకు, కేవలం ఎంపీపీ, సర్పంచ్ గా మాత్రమే గాక రెండు సార్లు ఎమ్మెల్యేను చేశారు. మూడో సారి నమ్మకంతో టికెట్​ ఇచ్చారు. జీవితాంతం రుణపడి ఉంటా. తాగు, సాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్న ఆలేరు ప్రజల బాధను కేసీఆర్​  తీర్చారు. 

ALSO READ : జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు

కేసీఆర్​ను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత 

మళ్లీ గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి 

మరోసారి అవకాశం కల్పిస్తే కోదాడను అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తా. రె వెన్యూ డివిజన్​ ఏర్పాటు చేసినం. కొత్త మండలాలు ఏర్పాటు చేసినం. మరోసారి గెలిస్తే తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తా. సీఎం కేసీఆర్​ ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పి స్తాం. అన్ని వర్గాల ప్రజలు భారీ 

బొల్లం మల్లయ్య యాదవ్​, ఎమ్మెల్యే