ఓట్లు వేసేముందుకు తెలంగాణ గత చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని..రాష్ట్రం ఎవరి చేతుల ఉంటే సుురక్షితంగా ఉంటది.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతది అని చర్చించి ఓటు వేయాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. అభ్యర్థులతో పాటు పార్టీల చరిత్రను చూసి గెలిపించాలని కోరారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్ ఎస్ ప్రభుత్వం..పేదరికం లేని తెలంగాణకోసం కృషి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. గాబరా గాబరా కాకుండా..గ్రామాల్లో అందరూ కలిసి చర్చించి ఓటు వేయాలని కోరారు.
రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నా పార్టీ బీఆఎస్... రైతు బాగుంటే అందరూ బాగుంటారని ఆలోచించి వ్యవసాయం దృష్టి సారించాం. ప్రాజెక్టులు కట్టినం, పెట్టుబడి కోసం రైతు బంధు ఇస్తున్నం..ధాన్యం కొనుగోలు చేస్తున్నం.. రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే.. వారంలోపే ఐదు లక్షల రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.. కాంగ్రెస్ వస్తే ఇవన్నీ తీసేస్తదట.. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్. ఇవన్నీ గ్రామాల్లో చర్చించి.. ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు.