శ్రీరామ నవమి సందర్భంగా భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణ కోసం సీఎం ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్ మంజూరు చేశారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భధ్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాములోరి కల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. మార్చి 30న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.