కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తాం

కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం  ఏర్పాటు చేస్తాం

పీవీ నిరంతర సంస్కరణ శీలి అన్నారు సీఎం కేసీఆర్. పీవీ మార్గ్ ఆయన విగ్రహానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు.అనంతరం పీవీ రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్...పీవీ శతజయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయన్నారు. పీవీ తెచ్చిన అనేక సంస్కరణలు తమ కళ్లముందున్నాయన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం అని అన్నారు. నవోదయ, గురుకులాలకు పీవీ ఆద్యులన్నారు. విద్యానిది,సాహిత్య పెన్నిది పీవీ అన్నారు. పీవీ తన 800 ఎకరాల భూమిని దానం చేశారన్నారు.  కాకతీయ వర్సిటీలో  పీవీ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు విజయవంతంగా నడిపారన్నారు. పీవీ కృషిని మన్మోహన్ అనేకసార్లు ప్రశంసించారన్నారు. పీవీ సంస్కరణలు దేశానికి వరమన్నారు. తనకు పీవీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మన్మోహన్ చెప్పారన్నారు.