రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలు

రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. సిద్దిపేటలో  పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేసీఆర్.. సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని అన్నారు. సిద్దిపేట, వరంగల్ ,నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలన సంస్కరణలో భాగంగా జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు  కేసీఆర్.  గతంలో మంచినీటికి ఇబ్బందిపడ్డామని..ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయన్నారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయన్నారు. ఇందుకోసం తెలంగాణ కోరుకున్నామన్నారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ సబ్ స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేదన్నారు. కరెంట్ లో ఎలాంటి బాధలు అనుభవించామో సిద్ధిపేట వాసులకు ఎక్కువగా తెలుసన్నారు. కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారన్నారు. సమైక్య పాలనలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయన్నారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయకు రూపకల్పన చేశామన్నారు.

తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామన్నారు కేసీఆర్. ఎఫ్ సీఐ కి కోటి 40 లక్షల టన్నులు అమ్మినమన్నారు. రాష్ట్రంలో 26 లక్షల టన్నుల ఎరువులు వాడుతున్నారన్నారు.25 లక్షల టన్నులకు గోదాంల సామర్థ్యం పెంచినమన్నారు. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్ ను అధిగమించామన్నారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధితోనే ఇదంతా సాధ్యమైందన్నారు.తెలంగాణలో 2కోట్ల 25లక్షల ఎకరాల భూమి  ఉందన్నారు. అందులో సాగుభూమి కోటి 50లక్షల ఎకరాలన్నారు.