హైదరాబాద్ : GHMCలో 104 సీట్లు టీఆర్ఎస్ వే అన్నారు సీఎం కేసీఆర్. శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. GHMCలో ప్రతి ఒక్కరికి బాద్యతలు ఉంటాయన్నారు. డివిజన్ల వారీగా బాధ్యతలు ఇస్తామని…కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు త్వరలో ఓరియెంటెషన్ క్లాస్ లు ఉంటాయన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో స్పెషల్ గా 2 గంటలు మాట్లాడిన సీఎం..కోత్త ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలో చెప్పారు. నియోజకవర్గంలో కొత్త ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై చెప్పుకొచ్చారు సీఎం.