
ప్రగతి భవన్ : శ్రీలంక లో బాంబు పేలుళ్లు జరిగి చాలామంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.