అభివృద్ధి చేయని గల్లీ.. పథకాలు అందని ఇల్లు లేదు : గణేశ్​గుప్తా

నిజామాబాద్, వెలుగు: రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి నగరాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నానని బీఆర్ఎస్​ అర్బన్​ అభ్యర్థి గణేశ్​ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ప్రతి గల్లీ డెవలప్​ చేశానని, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లంటూ లేదన్నారు. బుధవారం ఆయన 25, 48 డివిజన్​లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మేయర్​దండు నీతూ కిరణ్, లీడర్లు సిర్ప రాజు, బొబ్బిలి మురళి, సీతారాం, సాయి ​పాల్గొన్నారు.