ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో విషాదం జరిగింది. సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.
రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు జరగనున్నాయి.
మరిన్ని వార్తలు