ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యనటకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీ స్వాగత కార్యక్రమానికి హాజరయ్యారు. మోడీకి స్వాగతం పలకడం మొదలు తిరిగి ఢిల్లీకి పయనమ్యయే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని వెంట ఉంటారని శుక్రవారం సీఎంఓ వర్గాలు తెలిపాయి.