చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. బతుకమ్మ చీరలు నచ్చకపోతే తీసుకోవద్దు.. అంతే కానీ చీరల పంపిణీని రాజకీయం చేయొద్దన్నారు. దీనివల్ల రూ. 300 నుంచి 400 కోట్లతో పరిశ్రమలకు పని దొరుకుతుందిని చెప్పారు. కొంతమంది ఆ చీరలను కాలబెడుతున్నారని, మిమ్మల్నీ ఎవరూ కట్టుకోమన్నారు అని ఫైరయ్యారు. సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో ఊహించనంత అభివృద్థి జరిగిందని సీఎం చెప్పారు. ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటే కన్నీళ్లు పెట్టుకున్నానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
రైతుల కోసం ధరణి తెచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ధరణిలో సమస్యలుంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోతే మళ్లీ వ్యవస్థ మొదటికి వస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని, ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.
Also Read :- వివాదాస్పదంగా మారిన కవిత జగిత్యాల పర్యటన
తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈరోజు ప్రధాని రాష్ట్ర గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ సరఫరా లేదన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.