సిద్దిపేట రుణం ఏం చేసినా ఈ జన్మలో తీర్చుకోలేను : కేసీఆర్

సిద్దిపేట రుణం ఏం చేసినా ఈ జన్మలో తీర్చుకోలేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.  సిద్దిపేట తనను సీఎం చేసిందని చెప్పారు.  సిద్దిపేటలో జరిగిన  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.  సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషిన్ భగీరథకు స్ఫూర్తి అని తెలిపారు. సిద్దిపేటకు ఆరడుగుల బుల్లెట్ లాంటి హరీష్ రావును అప్పగించానని సీఎం  చెప్పారు.   సిద్దిపేటలో హరీష్ తనకంటే ఎక్కువ అభివృద్ది చేశారని తెలిపారు. త్వరలో సిద్దిపేట వజ్రపు తుణకలా తయారు అవుతుందని తెలిపారు. సిద్దిపేట యావత్ తెలంగాణకు తలమానికంగా మారిందని సీఎం చెప్పారు.    ఈ సారి లక్ష మోజార్టీతో హరీష్  రావును గెలిపించాలని కోరారు. 

సిద్ధిపేట అభివృద్ది కేసీఆర్ వల్లే  సాధ్యం  : హరీష్‌ రావు

సిద్ధిపేట అభివృద్ది సీఎం కేసీఆర్ వల్లే  సాధ్యమైందని చెప్పారు మంత్రి హరీష్‌ రావు.  పదేళ్ల క్రితం సిద్ధిపేట కరువులో ఉందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లను ఇచ్చి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు.  రైతుల గౌరవాన్ని కేసీఆర్ పెంచారని , వారిలో దైర్యాన్ని నింపారని కొనియాడారు.  కేవలం మూడేళ్లలో కాళేశ్వరం పూర్తైన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సోయిలేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. తన చివరిశ్వాస వరకు సీఎం కేసీఆర్ కు, సిద్ధిపేట ప్రజలకు రుణపడి ఉంటానని హరీష్‌ రావు చెప్పారు.