ధరణి తీసేస్తే మళ్లీ కథ మొదటికొస్తదన్నారు సీఎం కేసీఆర్. రైతుబంధు, ధరణి వద్దంటున్న కాంగ్రెస్ కు ప్రజలకు బుద్దిచెప్పాలన్నారు. మహబూబాబాద్ సభలో మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల్లో ప్రజలే గెలవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మస్తు అభివృద్ధి అయ్యిందన్నారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ అరిగోసలు పడుతారని చెప్పారు. తాగునీరు,సాగునీరు కోసం ఎన్నో తిప్పలు పడ్డామని తెలిపారు. రైతుబందు, కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ అవసరమా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ధరణిని తీసి బంగాళఖాతంలో పడేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ కథ మొదటికొస్తదన్నారు. పైరవీ కారులు ,దళారులు రాజ్యమేలుతారని చెప్పారు. ధరణితో భూములు కబ్జా పెట్టే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నో సార్లు మోసం చేసినా పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించామన్నారు కేసీఆర్. ఎవరెన్ని చెప్పినా వినొద్దని.. న్యాయం ఏంటో తెలుసుకుని ఓటెయ్యాలని చెప్పారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రగతి కంటిన్యూ అవుతదన్నారు. పోడుభూమూలకు 20 వేల పట్టాలిచ్చామన్నారు కేసీఆర్.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాంరాం
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాంరాం.. దళితబంధు జై భీం అని వ్యాఖ్యానించారు కేసీఆర్. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని అన్నారని.. రైతుబంధు ఉండల్నా ? రైతుబంధు దుబారానా? ప్రజలే తేల్చుకోవాలన్నారు. తాను రైతును కాబట్టి రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. రైతుబంధు స్కీంను ఎంఎస్ స్వామినాథన్ మెచ్చుకున్నారని కేసీఆర్ చెప్పారు.
- ALSO READ | బీజేపీ గెలిస్తే.. తెలంగాణకు బీసీ సీఎం: అమిత్ షా