అమ్మకానికి కేసీఆర్ గుడి

అమ్మకానికి కేసీఆర్ గుడి

కేసీఆర్ గుడిని తెలంగాణ ఉద్యమకారుడు అమ్మకానికి పెట్టాడు. ఆర్థికంగా నష్టపోయిన పార్టీలో గుర్తింపు లేనందుకే అమ్మకానికి పెట్టానని ఉద్యమకారుడు తెలిపాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో సీఎం కేసీఆర్ గుడిని, కేసీఆర్ విగ్రహాన్ని అమ్మడానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంఘటన ఈ ప్రాతంలో సంచలనంగా మారింది. 

దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్యమ కారుడు గుండ రవీందర్ కేసీఆర్ మీద అభిమానంతో రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రసాధనకు లాఠీ దెబ్బలు తిని కేసులపాలైన, కేసీఆర్ పై అభిమానంతో కేసీఆర్ కు గుడికట్టి కేసీఆర్ విగ్రహం పెట్టిన ఆర్ధికంగా నష్టపోయిన పార్టీలో గుర్తింపు లభించలేదు ఉద్యమ ఆశయం నెరవేరలేదు అందుకే.. కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టానని ఆయన తెలిపారు. 

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపాలనే ఉద్ద్యేశ్యంతో స్వంత నిధులతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు తో పాటు తన ఇంటి వద్ద కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి పాలరాతి తో గుడి నిర్మించి అభిమానం చాటుకున్నారు.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర సాధన ఆశయాలను నేర వేర్చలేదని, వ్యక్తి గతంగానైన తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది చేకూరలేదని కనీసం పార్టీలో కూడ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసక్తి గల వారు కేసీఆర్ గుడిని విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆర్ధికంగా నష్టపోయిన తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.