రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సంపేటలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్లనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంట దెబ్బతింది. ఈ అంశంపై కేబినెట్లో చర్చించిన సీఎం కేసీఆర్.. తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

కొనసాగుతున్న కేబినెట్ సమావేశం

317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ టీచర్ల ఆందోళన