పెద్దపల్లి జిల్లాలో ఆగస్టు 29వ తేదీన సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే పార్టీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ఈ మధ్యే వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పర్యటించి.. కొత్త కలెక్టరేట్స్ బిల్డింగ్స్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మరో మూడు జిల్లాల్లో రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఆగస్టు 29వ తేదీన పెద్దపల్లి, సెప్టెంబర్ 05న నిజామాబాద్, సెప్టెంబర్ 10వ తేదీన జగిత్యాల జిల్లాల్లోని కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.