తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9 గంటల 20 నిమిషాల సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 36 స్థానాల్లో లీడ్ లో ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ 21 స్థానాల్లో.. బీజేపీ ఐదు సీట్లలో.. ఎంఐఎం 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మొదటి రౌండ్ లోనే స్పష్టమైన మెజార్టీలతో ముందుకు దూసుకెళుతుంది. సీఎం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గంలో.. కేసీఆర్ వెనకంజలో ఉండటం ఆసక్తి రేపుతోంది.
కామారెడ్డి మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 2 వేల 766 ఓట్లు పడగా.. కేసీఆర్ కు 2 వేల 723 ఓట్లు పడగా.. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 3 వేల 543 ఓట్లు పడ్డాయి. సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..