కేసీఆర్ రెండేండ్ల పాలన నేటితో పూర్తి.. బయటకు రాలే.. బాధలు పట్టించుకోలే

రెండేండ్లల్ల గాడి తప్పిన పాలన.. అమలు కాని హామీలు

చేసింది ఏంది?

సీఎం బయటకు రాలే.. జనం బాధలు పట్టించుకోలే

కరోనా టైంలో టెస్టులు చేయలే.. వానలొస్తే అప్రమత్తం చేయలె

నష్టపోయిన రైతులను ఆదుకోలే

గత లోక్​సభ ఎన్నికల నుంచే ఓటుతో షాక్ ఇస్తున్న ప్రజలు

మొన్నటి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు

టీఆర్​ఎస్​ సర్కారు రెండో టర్మ్​లో రెండేండ్ల పాలన నేటితో పూర్తి

సీఎం కేసీఆర్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టి ఇయ్యాల్టికి రెండేళ్లు.  ఈ రెండేళ్లలోనే లోక్​సభ ఎన్నికల్లో టీఆర్ఎస్​ కు జనం షాక్ ఇచ్చారు. ఇగ అప్పటి నుంచి టీఆర్ఎస్​కు వరుసగా రాజకీయ ఎదురుదెబ్బలే. సెకండ్ టర్మ్​లో హామీల అమలును కేసీఆర్ పట్టించుకోలేదు. ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు అభాసు పాలయ్యాయి. ఏపీ నీళ్ల దోపిడీ చేస్తున్నా స్పందించకపోవడం.. ఆర్టీసీ సమ్మె టైంలో కార్మికుల బాధలను పట్టించుకోకపోవడం.. కరోనా టెస్టులపై నిర్లక్ష్యం.. పైగా ‘టెస్టులు ఎక్కువ చేస్తే ప్రైజులు ఇస్తరా?’ అని ఎగతాళి చేయడం.. అన్ని వర్గాల నుంచి సర్కారు విమర్శలను,
వ్యతిరేకతను ఎదుర్కొంది. సైలెంట్​గా అన్నీ భరించిన జనం  కీలెరిగి వాత పెట్టారు. అటు దుబ్బాక, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇకనైనా సారు మారాలని, ఫాం హౌస్ నుంచి బయటికి రావాలని జనం అంటున్నారు.

ఎల్ఆర్ఎస్ దోపిడీ.. ధరణి లొల్లి

లే ఔట్ల రెగ్యులరైజేషన్ పేరుతో జనం నుంచి భారీగా ఫీజులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ఆర్ఎస్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో కాస్త తగ్గించింది. మరింత తగ్గించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా సర్కారు వినలేదు. మరోవైపు ధరణి పోర్టల్ ద్వారానే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన సర్కారు.. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లను బంద్ పెట్టింది. ధరణి పోర్టల్ భద్రతపై హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. చివరికి వెనక్కి తగ్గి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు రెడీ అయింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, రిజిస్ట్రేషన్ల బంద్ తో జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పై ఎఫెక్ట్​ చూపింది.

రుణమాఫీ ఏమైంది?

రెండోసారి పవర్​లోకి  వచ్చిన టీఆర్ఎస్​ సర్కారు.. లక్షలోపు రుణమాఫీని నాలుగు విడతలుగా చేస్తామని ప్రకటించినా.. గత రెండేండ్లలో కేవలం ఒక విడత.. అది కూడా 25 వేల చొప్పున మాత్రమే మాఫీ చేసింది.

ఉద్యోగాల్లేవ్​, భృతి లేదు!

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఫస్ట్​ టెర్మ్​లో కేసీఆర్ చెప్పారు.  రెండో టర్మ్​ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఉద్యోగాల భర్తీ లేదు. నిరుద్యోగ భృతి ముచ్చటే లేదు.

షరతుల సాగు, సన్నొడ్ల బాధలు

తాము చెప్పిన పంట వేసిన వారికే రైతుబంధు పైసలు ఇస్తామని సీఎం తొలుత ప్రకటించారు. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది.  సర్కారు చెప్పిందని సన్నొడ్లు వేసిన రైతులూ ఇబ్బంది పడ్డారు.

ఏపీ నీళ్లు దోచుకెళ్తున్నా..

సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును కడ్తామని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా, కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు.

వరదలొస్తే పట్టించుకోలే

హైదరాబాద్ లో భారీగా వరదలొచ్చి కాలనీలన్నీ నీళ్లల్ల మునిగిపోతే సీఎం కనీసం పరామర్శించలేదు. పైగా మంత్రుల, నేతల కామెంట్లతో జనం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

హైదరాబాద్, వెలుగు: 2018 డిసెంబర్ 12.. ఇదే రోజు.. 88 సీట్లతో టీఆర్ఎస్ రెండో సారి అధికారం చేపట్టింది.. ఏడాది గడిచింది.. కథ మారింది. మొదటి టర్మ్​లో వరుస గెలుపులతో హుషారుగా కనిపించిన కారు.. సెకండ్ టర్మ్​లో వరుస ఓటములతో చతికిలపడుతోంది. హామీలు అమలు చేయకపోవడం, పాలనను పట్టించుకోకపోవడం, వివాదాస్పద నిర్ణయాలతో తొలిసారి 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నది. అప్పటి నుంచి నిన్నమొన్నటిదాకా రాజకీయంగా, పాలన పరంగా ఓడిపోతున్నది. గత లోక్​సభ ఎన్నికల్లో ‘‘సారు.. కారు.. పదహారు ఎంపీ సీట్లు’’ అనే నినాదంతో టీఆర్ఎస్ లీడర్లు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 9 సీట్లనే గెలుచుకున్నారు. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి నుంచి ఓడిపోయారు. ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ కు సపోర్టుగా ఉన్న దుబ్బాక ప్రజలు మొన్నటి బై ఎలక్షన్​లో టీఆర్ఎస్ ను ఆదరించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొడ్తామని టీఆర్ఎస్ లీడర్లు చెబితే.. ప్రజలు కేవలం 56 సీట్లను మాత్రమే గెలిపించారు. బీజేపీ 48 సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్ల తేడా 6 వేలు మాత్రమే. అంటే టీఆర్ఎస్​పై గ్రేటర్​హైదరాబాద్​ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఉద్యోగాల ఊసే లేదు.. నిరుద్యోగ భృతి జాడే లేదు

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఫస్ట్​ టెర్మ్​లో కేసీఆర్ ప్రకటించారు. అది పూర్తయి.. రెండో టెర్మ్​లో అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఉద్యోగాల భర్తీ లేదు. ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 35,724 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. కానీ ఈ ఏడేండ్లలో ఇంతకంటే ఎక్కువగా ఉద్యోగులు, టీచర్లు రిటైర్​ అయ్యారు. దాంతో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నట్టు అంచనా. అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ జరగలేదు. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను పట్టిం చుకోవడం లేదు. ఇక 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండేండ్లయినా దాని ముచ్చట్నే ఎత్తడం లేదు. అసలు నిరుద్యోగ భృతికి సంబంధించి ఎటువంటి గైడ్​లైన్స్​గానీ రెడీ చేయలేదు. ఏపీ నీళ్ల దోపిడీకి ఇన్​డైరెక్టు సపోర్టు కృష్ణా జలాలను అక్రమంగా తరలిం చుకుపోయేందుకు ప్లాన్ వేసిన ఏపీ.. కొత్తగా పలు ప్రాజెక్టులు చేపట్టింది. సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును కడ్తామని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా, కేబినెట్లో నిర్ణయం తీసుకున్నా సీఎం కేసీఆర్ పట్టిం చుకోలేదు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందో ళన చేపట్టినా మౌనంగానే ఉన్నారు. మరోవైపు ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని అపోజిషన్ పార్టీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్రం అపెక్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసింది. కానీ కేసీఆర్​ ఆ మీటింగ్​ను వాయిదా వేయించడం, ఏపీ పోతిరెడ్డిపాడు టెండర్లను పూర్తి చేశాక అపెక్స్​ మీటింగ్​కు హాజరుకావడం, అప్పటిదాకా మౌనంగానే ఉండి.. తర్వాత ఏపీ తీరును తప్పుపడుతున్నట్టుగా ప్రకటనలు చేయడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అసలు ఏపీ జల దోపిడీకి కేసీఆర్ సహకరిస్తున్నారనే అనుమానాలు తలెత్తాయి.

ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానంటూ..

తమ డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే అది అక్రమమని కేసీఆర్​ ప్రకటించారు. ఉద్యోగాలు పోతాయని బెదిరించారు. సంస్థను ప్రైవేటుపరం చేస్తానని ఏకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. అయినా కార్మికులు ధైర్యంగా సమ్మెను కొనసాగించారు. చివరికి ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసి కార్మికులను లొంగదీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్  తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

షరతుల సాగు.. సన్నొడ్ల బాధలు

కేసీఆర్ రైతుల విషయంగా ఆంక్షలు పెట్టడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. షరతుల సాగు పేరుతో తాము చెప్పిన పంట వేసిన వారికే రైతుబంధు పైసలు ఇస్తామని తొలుత ప్రకటించారు. కానీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. తర్వాత సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ మాటలు నమ్మిన రైతులు పెద్ద ఎత్తున సన్నరకాలు పండించారు. కానీ సన్న రకాలతో దిగుబడి తక్కువ రావడం, వానలతో పంట దెబ్బతినడం, ఉన్న కాస్త పంటను కూడా కొనేదిక్కు లేకపోవడంతో రైతులు గోస పడ్డారు. చివరికి సన్నాలకు యాభయ్యో, వందో ఎక్కువిస్తామని దుబ్బాక బై ఎలక్షన్​కు ముందు ప్రకటించారు. అయినా ఇప్పటికా అమలు చేయలేదు. దొడ్డు వడ్ల కన్నా సన్నాలకు తక్కువ రేటు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక వానా కాలంలో మక్కలను కొనేది లేదని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దీంతో రైతులు రొడ్డెక్కి ఆందోళనలు చేయడంతో దిగొచ్చి.. కొనుగోలు చేస్తామని చెప్పారు. అయినా పూర్తి స్థాయిలో మక్కలు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

ఉద్యోగాల ఊసే లేదు.. నిరుద్యోగ భృతి జాడే లేదు

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఫస్ట్​ టెర్మ్​లో కేసీఆర్ ప్రకటించారు. అది పూర్తయి.. రెండో టెర్మ్​లో అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఉద్యోగాల భర్తీ లేదు. ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 35,724 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. కానీ ఈ ఏడేండ్లలో ఇంతకంటే ఎక్కువగా ఉద్యోగులు, టీచర్లు రిటైర్​ అయ్యారు. దాంతో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నట్టు అంచనా. అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ జరగలేదు. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను పట్టించుకోవడం లేదు. ఇక 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. రెండేండ్లయినా దాని ముచ్చట్నే ఎత్తడం లేదు. అసలు నిరుద్యోగ భృతికి సంబంధించి ఎటువంటి గైడ్​లైన్స్​గానీ రెడీ చేయలేదు.

ఎంప్లాయీస్ నూ పట్టించుకుంటలేరు

ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అడ్రస్ లేదు. 2018 జూలై నుంచే పీఆర్సీ అమలుకావాల్సి ఉన్నా.. ఇంకా అమల్లోకి రాలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ను 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ హామీ కూడా ఇప్పటికీ అమల్లోకి రాలేదు.

హైదరాబాద్ వరదలపై వితండ వాదన

హైదరాబాద్ లో భారీగా వరదలు రావడంపై టీఆర్ఎస్ లీడర్లు వితండ వాదనలకు దిగారు. ‘వానొస్తే నీళ్లు రాకపోతే మంటలు వస్తయా, వరదలు ఒక్క హైదరాబాద్ కు వచ్చినయా.. బాంబే, మద్రాసుకు రాలేదా? గత పాలకుల టైంలో అక్రమ కట్టడాలు జరగలేదా?’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సమీపంలోని బస్తీలు, కాలనీలు నీటమునిగినా ప్రగతిభవన్ లో ఉన్న కేసీఆర్ పరామర్శించలేదు. ఈ విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తే ‘సీఎం కు చాలా పనులు ఉంటాయి’ అని స్వయంగా మంత్రి కేటీఆర్ సమర్థించుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. వరద బాధితులకు రూ.పది వేల ఆర్థిక సాయంలో టీఆర్ఎస్  లీడర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. సాయం కోసం మీసేవ సెంటర్ల ముందు వేలాది మంది బాధితులు క్యూలు కట్టారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత వరద సాయం పంపిణీ మళ్లీ మొదలుపెడ్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. తర్వాత ఊసెత్తడం లేదు.

ఆసరా ఏజ్​ తగ్గింపు ఏదీ?

ఆసరా వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్​ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ప్రకటించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు లెక్కలు తీశారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో త్వరలోనే అర్హులకు పెన్షన్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇంత వరకు అది అమల్లోకి రావడం లేదు. 57 ఏళ్లు నిండిన వాళ్ల విషయం పక్కన పెడ్తే.. 65 నిండి, ఇప్పటివరకు పెన్షన్​ రాని వాళ్లకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు.