కొత్తపల్లి, వెలుగు: దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ఈ విషయంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్బల్దియా పరిధిలోని కొత్తపల్లి పట్టణంలో శుక్రవారం మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. మెడికల్ కాలేజీ ప్రారంభానికి కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. రేకుర్తి నుంచి మెడికల్ కాలేజీ వరకు జనసంద్రాన్ని తలపించింది.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్‌కమిషన్ వైస్చైర్మన్బోయినిపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్న శుక్రవారం రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన దినమని చెప్పారు. గతంలో వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లేవారన్నారు. రాష్ట్ర ఏర్పడ్డ టైంలో రాష్ట్రంలో 5 మెడికల్‌కాలేజీలు ఉంటే, ఇప్పుడు జిల్లాకో కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. దీంతో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు.
ALSO READ: స్టూడెంట్ నిద్ర లేవలేదని తల పగలగొట్టిన టీచర్
వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు ఎంబీబీఎస్ సీట్లతోపాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సిబ్బంది కూడా కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బి.గోపి, మేయర్ వై.సునీల్‌రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, సివిల్సప్లై చైర్మన్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్‌బాబు, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఎంహెచ్‌వో లలితాదేవి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.