రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం(2023 అక్టోబర్ 17వ తేదీ) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
సిరిసిల్ల బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ సిరిసిల్లకు చేరుకొనున్నారు. సీఎం పాల్గొనబోయే ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దీంతో సిఎం సభకు సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల నుండి భారీ జన సమీకరణకు బిఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు.