నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్

  • కుటుంబం తరఫున కిలో బంగారం
  • మంత్రులు అల్లోల, వేముల బంధువులు, 
  • ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తరఫున మరో 3 కిలోలు సమర్పణ
  • జాతీయ పార్టీ ఏర్పాటుకు ముందు నర్సింహ స్వామి దర్శనం
  • రేపు వరంగల్​లో పర్యటన

హైదరాబాద్‌‌ / యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం కేసీఆర్​ శుక్రవారం యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌‌ నుంచి భార్య శోభ, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రోడ్డుమార్గంలో బయల్దేరి ఉదయం 11.30 గంటలకు అక్కడికి చేరుకుంటారు. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నందునే  లక్ష్మీనర్సింహస్వామి ఆశీర్వాదం కోసం కేసీఆర్​ యాదగిరిగుట్ట టూర్​ పెట్టుకున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. యాదగిరిగుట్ట ఆలయ  గోపురం స్వర్ణ తాపడానికి కేసీఆర్‌‌ తన కుటుంబం తరఫున కిలో బంగారం సమర్పించనున్నారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బంధువులు, వేముల ప్రశాంత్‌‌ రెడ్డి బంధువులు చెరో కిలో, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌ రెడ్డి కిలో బంగారాన్ని అందజేయనున్నారు. మొత్తంగా నాలుగు కిలోల బంగారాన్ని ఆలయంలో కేసీఆర్ సమర్పించనున్నారు. గర్భగుడిపై ఉన్న దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో బంగారం ఇస్తానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోనున్నారు. యాదగిరిగుట్టకు చేరుకున్న అనంతరం ప్రెసిడెన్షియల్‌‌ సూట్‌‌కు వెళ్లి అక్కడి నుంచి కొండపైకి వెళ్తారు. 

గర్భగుడిలో స్వయం భూ లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌‌‌‌ సూట్‌‌‌‌కు చేరుకొని లంచ్‌‌‌‌ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమై 4 గంటలకు ప్రగతి భవన్‌‌‌‌కు చేరుకుంటారు. సీఎం హోదాలో కేసీఆర్‌‌‌‌ ఇప్పటికే 20 సార్లు యాదగిరిగుట్టను సందర్శించారు. శుక్రవారం సీఎం టూర్‌‌‌‌ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వర్షంతో చిత్తడిగా మారిన బస్‌‌‌‌బే ఏరియా క్లిన్‌‌‌‌ చేశారు.

రేపో మాపో కోనాయపల్లికి

సీఎం కేసీఆర్‌‌‌‌ ఏ పని తలపెట్టినా సిద్దిపేట జిల్లాలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటిస్తున్నందున ఆలోపే కేసీఆర్ కోనాయపల్లికి వెళ్తారని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ఖరారయ్యాయని.. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జాయింట్‌‌‌‌ ఎల్పీ మీటింగ్‌‌‌‌లో వాటిపై కేసీఆర్‌‌‌‌ ప్రకటన చేస్తారని అంటున్నాయి. దసరా రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం ఉంటుందని, మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్‌‌‌‌ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. 

రేపు వరంగల్‌‌‌‌కు

సీఎం కేసీఆర్‌‌‌‌ శనివారం వరంగల్‌‌‌‌ పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్‌‌‌‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. ఉదయం 11.15 గంటలకు ములుగు రోడ్డులోని ప్రతిమ రిలీఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, క్యాన్సర్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్లను ప్రారంభిస్తారు. వరంగల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌‌‌‌కు బయల్దేరుతారు.