రేపు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్ 

హైదరాబాద్ : క‌రోనా క్ర‌మంలో బుధ‌వారం గాంధీ హాస్సిట‌ల్ ను సంద‌ర్శింన సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. అనంత‌రం సెంట్రల్ జైల్ ను పరిశీలించనున్న సీఎం..జైల్ ను ధర్మసాగర్ , లేదా మామునురు తరలించి... అక్కడ ఎంజీఎం హాస్పిటల్ నిర్మించాలని నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. మ‌ధ్యాహ్నం కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంట్లో లంచ్ చేయనున్నారు. ఎంజీఎంలో కోవిడ్ ట్రీట్ మెంట్, సెంట్రల్ జైల్ తరలింపు తదితర అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. బుధ‌వారం గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్ క‌రోనా రోగులతో మాట్లాడిన విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్ ఎంజీఎంకు కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ కూడా వెళ్లే అవకాశం ఉందంటున్నారు.