మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ

బెంగళూరు: బెంగళూరు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దేవెగౌడ తనయుడు, కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి కూడా ఉన్నారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. గురువారం బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ, ఆయన తనయుడు కుమార స్వామి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ వెంట  ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి ఉన్నారు.

దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న క్రమంలో.. వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో జాతీయ రాజకీయాల గురించి వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఇక పీఎం మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్న వేళ... కేసీఆర్ బెంగళూరు టూరుకు వెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది. మోడీకి భయపడే కేసీఆర్ బెంగళూరుకు పారిపోయారని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

దేశంలో దమ్మున్న నాయకుడు కేసీఆర్

మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు