ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి గంగుల
కొండగట్టు, వెలుగు : సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టుకు రానున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ క్యాంపస్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈనేపథ్యంలో మంగళవారం సాయంత్రమే కొండగట్టుకు చేరుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెలిప్యాడ్‌ను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.