ఇయ్యాల మునుగోడుకు కేసీఆర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సీఎం కేసీఆర్ ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లనున్నారు. చండూరు మండలం బంగారుగడ్డలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయల్దేరి బంగారుగడ్డకు చేరుకుంటారు.  సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తారు.

ఈ సభకు లక్ష మందిని తరలించాలని అనుకున్నప్పటికీ, గ్రౌండ్ ఆ స్థాయిలో లేకపోవడంతో 30 వేల మందిని తరలించే అవకాశం ఉందని టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు చెబుతున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై ఈసీ నిషేధం విధించడంతో కేసీఆర్ సభకు ఆయన దూరంగా ఉండనున్నారు.