సీఎం కేసీఆర్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి వెళ్లనున్నారు. 11.30 కు అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు.
జాతీయ పార్టీపై అక్టోబర్ 5న కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం యాదగిరి గుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దసరా కంటే ముందే సిద్ధిపేటలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది. నేషనల్ పాలిటిక్స్ పై ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారని అందరిలో ఉత్కంఠ నెలకొంది.