
- కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
శంకర్పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో రూ. 800కోట్లతో మేధా సంస్థ ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు హరీశ్, శరత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సీఎం పర్యటించనున్న ప్రదేశాలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు వారు సూచించారు.