సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం (జూన్ 22న) ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్లను అందించనున్నారు.
కొల్లూరు వద్ద నిర్మించిన హౌసింగ్ కమ్యూనిటీలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. మొత్తం 145.5 ఎకరాల్లో ఒక్కో యూనిట్‌కు 560 చదరపు అడుగుల పరిమాణంలో ఇండ్లను నిర్మించారు. ఒకేచోట 15 వేల 660 ఇండ్లు నిర్మించడం ఆసియాలోనే రికార్డు. 11 అంతస్తుల్లో 117 బ్లాకుల్లో ఆధునిక పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. టౌన్ షిప్స్, గ్రేటెడ్ కమ్యూనిటీలను తలదాన్నేలా.. జీహెచ్ఎంసీ ఇండ్లను నిర్మించింది.
ALSO READ: గ్రాఫ్ డౌన్ .. 40 మందికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత
కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ప్లేగ్రౌండ్ లు, ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేశారు. మురుగునీరు శుద్ధి చేసేలా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కూడా ఉంది. సోలార్ వీధి దీపాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఉంది. పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్ లను కూడా నిర్మించారు. ఇప్పటికే కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్లకు హడ్కో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డ్ దక్కింది.
డబుల్ ఇండ్ల విశేషాలు..
మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణం 145 ఎకరాలు
మొత్తం 117 బ్లాక్‌లు, 15,660 డబుల్ ఇండ్లు
ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు
ఒక్కో ఇంటికి అయిన ఖర్చు రూ.7.60లక్షలు
నిర్మాణ వ్యయం రూ.1432.5 కోట్లు
జీ+9, జీ+10, జీ+11 అంతస్తులతో నిర్మాణాలు
11కేఎల్ కెపాసిటీ గల 12 వాటర్ సంపులు
ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌లు, జనరేటర్లు, ప్రతి ఫ్లోర్‌కు ఫైర్ సేఫ్టీ
10.05 కి.మీ తాగునీటి పైప్‌లైన్
10.60 కి.మీ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్
137 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
వీధి దీపాల కోసం 500 పోల్స్.. ఐమాస్ట్ లైట్ల కోసం 11 పోల్స్
3 షాపింగ్ కాంప్లెక్స్‌లు..118 దుకాణాలు
33కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ (1), 11 కేవీ(2)