ఈ నెల 20న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్ 

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసి.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం  చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే పూర్ణ మద్దతు తెలిపారు.కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారని థాకరే కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. రాష్ట్రాల హక్కుల కోసం దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని.. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుందని చెప్పారు. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం అని సీఎం కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.

మరిన్ని వార్తల కోసం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కేసు

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు