నేడు ఆసిఫాబాద్ కు సీఎం కేసీఆర్

ఆసిఫాబాద్, వెలుగు: పోడు భూముల పట్టాల పంపిణీని శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్​12 మంది లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు.  నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్​, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్,  కుమ్రంభీం విగ్రహం, దివంగత మాజీ గిరిజన మంత్రి కోట్నాక్ భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  

సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 50 వేల మందికి తరలించేందుకు బీఆర్ఎస్ లీడర్లు ఫ్లాన్​ చేస్తున్నారు.  కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ఏర్పాట్లను పరిశీలించారు.