- కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం
జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు చేరుకుంటారు. మొదట టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించి, ఒంటి గంటకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. ఆపై కలెక్టర్ కాంప్లెక్స్‌కు ఓపెనింగ్ చేస్తారు. అక్కడే అధికారులతో రివ్యూ నిర్వహించి, లంచ్ తర్వాత 3.10 గంటలకు జగిత్యాల మండలం మోతెలో బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్లో 4.40కి ఎర్రవెల్లి చేరుకుంటారు.
సీఎం ప్రోగ్రాం ఉందని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగే సీఎం కేసీఆర్ సభ కోసం కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ సెలవు ప్రకటించాయి. మంగళవారం రాత్రి టీఆర్ఎస్ లీడర్ల సూచన మేరకు ఆయా స్కూల్స్ నిర్వాహకులు స్టూడెంట్లకు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ ఉన్నందున బుధరవారం బడికి సెలవని మెసేజ్ చేశారు. సీఎం సభ కోసం పబ్లిక్‌ను తరలించేందుకు స్కూల్ బస్సులు అందజేస్తున్నామని, ఇందు కోసం బడులకు ఒకరోజు సెలవు ఇచ్చామని పేరెంట్స్‌కు పంపిన మెసేజ్‌లో మేనేజ్మెంట్లు పేర్కొన్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జనాన్ని తరలించేందుకు స్కూళ్లను బంద్పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం టూర్ బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి
జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ మంగళవారం గుండె నొప్పితో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తోన్న పరుశురాం.. సీఎం కేసీఆర్ టూర్ బుధవారం ఉండటంతో బందోబస్తు నిర్వహించడానికి జగిత్యాలకు వచ్చారు. డ్యూటీలో ఉండగా గుండెలో నొప్పిగా ఉందంటూ సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన పరశురాంను దవాఖానాకు తరలించగా..ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. కాగా, కానిస్టేబుల్ పరుశురాం సొంతూరు ఉట్నూరు మండలం ఓదెలు గ్రామమని స్టాఫ్ వెల్లడించారు.