పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో శుక్రవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో జరగనున్న బహిరంగ సభకు సీఎం హాజరవుతారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఆఫీసర్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లను గురువారం సీపీ అంబర్ కిశోర్ ఝా పరిశీలించారు.