రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆమెకు ఓ లేఖ పంపారు. తెలంగాణ ప్రజల తరఫున గవర్నర్ తమిళిసై కు బర్త్ డే విషెస్ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ లో పేర్కొన్నారు. ఆమెకు ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో మరెన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బర్త్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసైకు పలువురు నేతలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే గవర్నర్ తమిళిసైకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మధ్య గత కొంతకాలంగా సఖ్యత కుదరడం లేదు. ప్రొటోకాల్ పాటించకపోవడంపై గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వాటిపై స్పందించిన మంత్రులు ఆమెపై విమర్శలు చేయడంతో గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య గ్యా్ప్ పెరిగినట్లు కనిపించింది. తాజాగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది.